అనంతపురంలోని శారద నగర్ రుద్ర వైన్స్ దుకాణం వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులో ఉత్తరప్రదేశ్ కు చెందిన లాల్ సింగ్, హరీష్, సురేష్ అనే ముగ్గురు యువకులు గొడవపడ్డారు. వీరు ఓ ప్రింటింగ్ షాప్ లో పనిచేసే కార్మికులు. ఇవాళ సాయంత్రం నుంచి మద్యం అధికంగా సేవించి గొడవపడ్డారు. గొడవను ఆపటానికి వెళ్ళిన యువకులు కళ్యాణ్, పవన్ కుమార్ పై దాడి చేశారు. దాదాపు అరగంట పాటు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. మద్యం మత్తులో యువకులు కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్య రు.చివరికి స్థానికుల సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.