రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నల్లమాడలో వైసీపీ భారీ ర్యాలీ
పీ పీ పీ విధానం ద్వారా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని, దీనికి నిరసనగా బుధవారం మధ్యాహ్నం నల్లమాడలో వైసీపీ నాయకులు ఫ్ల కార్డులు చేత పట్టుకుని వారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైయస్సార్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వైద్యాన్ని ఇది ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.