పొలం పిలుస్తోంది'లో రైతులకు యూరియా వాడకంపై ఏవో సూచన
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఆర్.లోచర్ల, దొడగట్ట గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి రాజేశ్ మొక్కజొన్న, కంది పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. మోతాదుకు మించి యూరియా, ఎరువులు వాడరాదని సూచించారు. ఆర్. లోచర్ల రైతు సేవా కేంద్రంలో శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.