బనగానపల్లెలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ జయంతి సందర్బంగా బనగానపల్లెలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రహదారిలో ఉన్నటువంటి నేలమట్టం నందు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసా ఆచారి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండలం విశ్వబ్రాహ్మణ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో అలాగే రైతులు పాడిపంటలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని అలాగే యజ్ఞం మహోత్సవం నిర్వహించారు