ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సీఐ రామారావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అలాగే మైనర్ల వాహనాలను నడపడం వల్ల కూడా తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.