దిత్వా తుఫాను నేపథ్యంలో డిసెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు:జిల్లా కలెక్టర్ నిశాంత్
డిసెంబర్ 1, సోమవారం జరగబోయే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని దిత్వా తుఫాను నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి.. స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు.. జిల్లా కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలనుMeekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోగలరని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారు నమోదు చేసుకున్న అర్జీలు మరియు వాటి యొక్క పరిష్కార స్థితి గురించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 కి నేరుగా సంప్రదించగలరు.