కోడుమూరు: వర్కూరులో వైభవంగా మంగళ కైశిక ద్వాదశి వేడుకలు
కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలో హరిజనవాడలో వెలసిన రామాలయంలో ఆదివారం రాత్రి మంగళ కైశిక ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు చేపట్టారు. అనంతరం భజనలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గోవింద నామాలు పలికారు. హిందూ ధర్మ ప్రచారం మండలి జిల్లా కార్యనిర్వాకులు మల్లు వెంకట రెడ్డి, సభ్యులు ఎద్దుల మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గూడూరు సంజీవయ్య కాలనీలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి, వర్కూరు రామాలయంలో మంగళ కైశిక ద్వాదశి వేడుకలు వైభవంగా చేపట్టినట్లు తెలిపారు.