అసిఫాబాద్: జైనూర్,లింగాపూర్ మండలాల్లో దండారి సంబరాలు
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, లింగాపూర్ మండలాల్లో శనివారం రాత్రి దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రదర్శించిన గుస్సాడీ నృత్యాలు, యువత చేసిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ దండారీ ఉత్సవాల్లో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొని, తమ సంస్కృతిని చాటుతున్నారు. గుస్సాడీ నృత్యాలు చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.