తాడిపత్రి: జేబు దొంగను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేసిన తాడిపత్రి పోలీసులు
తాడిపత్రిలో జేబు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పుట్లూరు రోడ్డు పద్మావతి కళ్యాణ మండపంలో ముచ్చుకోటకు చెందిన వెంకటేశ్ తన జేబును కత్తిరించి నగదు దోచుకెళ్లినట్లు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. CI శివగంగాధర్ రెడ్డి దర్యాప్తు చేపట్టి ప్రొద్దుటూరుకి చెందిన వెంగన్న అనే వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని రూ.8వేల నగదు రికవరీ చేసి కేసు నమోదు చేశామన్నారు.