గద్వాల్: జిల్లాలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు – 44 వాహనాలపై కేసులు:మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాములు
మంగళవారం సాయంత్రం గద్వాల జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు (ఆర్టీఏ) విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమతులు, సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 స్కూల్ బస్సులు, 36 ప్రైవేట్ వాహనాలపై కేసులు నమోదు చేశారు.జిల్లాలోని అలంపూర్, మల్దకల్ మండలాల్లో ప్రత్యేక బృందాలుగా అధికారులు తనిఖీలు చేపట్టారు. మొదటి బృందానికి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాములు నేతృత్వం వహించగా, రెండవ బృందానికి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సాయి శృతి ప్రాతినిధ్యం వహించారు.