మచిలీపట్నం: ఎన్నికల హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది - గుడివాడ టీడీపీ కార్యాలయంలో జరిగిన సభలో MP బాలశౌరి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో గుడివాడ వచ్చిన బాలశౌరికి ప్రజా వేదిక టిడిపి కార్యాలయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని ప్రసంగించారు.