మంత్రాలయం: అనారోగ్యంతో బాధపడుతున్న మాధవరం వైసిపి నాయకుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి
మంత్రాలయం: మండలం మాధవరానికి చెందిన వైసీపీ నాయకుడు కురువ జయరాముడు కిడ్నీలో రాళ్లు ఉండటంతో ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం జయరాముడిని పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు దశరధ రెడ్డి ఉన్నారు.