జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్ రైతుబజార్ వద్ద మెయిన్ రోడ్డులో డీసీఎం వాహనం ఆగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం ఆగిపోయిన డీసీఎంను రెడీ మిక్స్ లారీ సహాయంతో పక్కకు తొలగించారు.