బొమ్మనహాల్ లో ఎంపిపి ఎన్నిక సందర్భంగా 144 సెక్షన్ విధించినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. ఆదివారం రాత్రి బొమ్మనహాల్ లో బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి 100 మీటర్ల దూరంలో అనుమతిలేని వ్యక్తులు లోపలికి ప్రవేశం లేదని తెలిపారు. ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.