తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఏరియా, సీబీ రోడ్, బస్టాండ్ ఏరియాల్లో శనివారం మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై, షాపులు, ఇళ్ళ ముందు చెత్తాచెదారం ఉండడంతో ప్రజలపై ఆగ్రహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలన్నారు. చెత్తను జాగ్రత్తగా మున్సిపాలిటీ చెత్త పనులకు అందజేయాలన్నారు.