తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తమిళనాడు మంత్రి రామచంద్రన్
పద్మావతి అమ్మవారిని తమిళనాడు రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కే కే ఎస్ ఎస్ ఆర్ రామచంద్రన్ శనివారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకొని భక్తులు చెల్లించుకున్నారు ఆలయం వద్ద సూపర్ ఇంటెండెంట్ ప్రసాద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు.