అసిఫాబాద్: వాంకిడిలో 10 అక్రమ సిలిండర్లు సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
వాంకిడి మండల కేంద్రంలోని పలు హోటళ్లలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ సిలిండర్ల స్థానంలో అక్రమంగా వినియోగిస్తున్న 10 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.