ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రైతులు మార్కాపురం మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలుదారులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని అన్నారు. మండల రైతులు యార్డుకు రాగా కొనుగోలుతారు రాకపోవడంతో ఆందోళన చెందారు. దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించలేని పరిస్థితి నెలకొన్నది అన్నారు. యార్డులో పత్తి విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.