శ్రీకాకుళం: వమరవల్లి కూడలి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా, ఒకరు మృతి,ఇంకొకరికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం నగరానికి చెందిన కిరణ్ స్నేహితుడు శరత్ తో కలిసి కలింగపట్నంలో గురువారం జరిగిన నిశ్చితార్థానికి హాజరయ్యారు. తిరిగి వస్తుండగా గార మండలం వమరవల్లి కూడలి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కిరణ మృతి చెందారు..ఘటనపై పోలీసులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..