ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్ చేపట్టిన రణభేరి జాతను జయప్రదం చేయండి : యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యారంగ సమస్యలు ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై యుటిఎఫ్ చేపట్టిన రణభేరి జాతను విజయవంతం చేయాలని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు జరిగిన యుటిఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మిరాజా, జయచంద్రారెడ్డి. వారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి ఐఆర్ ను ప్రకటిస్తామని నమ్మబలికి ఉద్యోగ ఉపాధ్యాయులతో లబ్ధి పొందిన తరువాత వారి న్యాయమైన సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా గడచావుని పెట్టడం చాలా హేయమైన చర్య అన్నారు.