మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ లో శ్రీ ఎస్ వి ఎస్ డైరెక్టర్ పాశం రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కేవైసీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గొరిగి నరసింహ కురుమ ప్రారంభించారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమలానగర్ కాలనీ అధ్యక్షుడు కొత్త మురళి గౌడ్, చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు మెడ బాపు రాజు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.