అల్లాదుర్గం: రాంపూర్ ఉమా సంగమేశ్వర రైస్ మిల్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్
Alladurg, Medak | Feb 12, 2025 మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివారులోని ఉమా సంగమేశ్వర రైస్ మిల్లు లో కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ యాదయ్య రైస్ మిల్లుకు చేరుకొని మృతికి గల వివరాలను సేకరించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రైస్ మిల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లి యాజమాన్యం రైస్ మిల్లు నడిపిస్తుందని తెలిపారు. రైస్ మిల్లుకు సంబంధించిన లైసెన్స్ తప్పితే, మరి ఇతర లైసెన్సులు కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ యాజమాన్యం తీసుకోవడం లేదంటూ లేబర్ ఆఫీసర్ యాదయ్య తెలిపారు.