గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కెరమెరి ఎస్ఐ మధుకర్ కోరారు. శుక్రవారం రాత్రి కెరమెరి (M) ఎస్సీ కాలనీలో నిర్వహించిన పోలీస్ కాళజాతలో ఆయన మాట్లాడుతూ.. గంజాయిపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలన్నారు. గ్రామంలో ఎవరైనా గంజాయి పంట సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి తాగే వారి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.