కుప్పం: శాంతిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశానికి ఏర్పాట్లు.
శాంతిపురం (M) శివపురం వద్ద సీఎం చంద్రబాబు సొంత ఇంటి గృహ ప్రవేశానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న సీఎం గృహప్రవేశం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ పార్టీ శ్రేణులు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం సీఎం ఇంటి సమీపంలోని పొలాలను చదును చేస్తున్నారు.