విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిని తారా తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిని తారా సువర్ణ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వాతావరణ శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో తాజా వాతావరణ పరిస్థితిపై మాట్లాడారు. రానున్న మూడు రోజులు పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.