శ్రీకాకుళం: కరాపాడు గ్రామంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి,ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, ఆర్. కరాపాడు గ్రామంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా... ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు కంచిలి (M) జాడుపూడి గ్రామానికి చెందిన రెయ్య ఊర్వశిగా స్థానికులు తెలిపారు. కాగ గాయాలు పాలైన దక్కత హేమ, పిలక హేమ లను చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ఆసుపత్రికి తరలించగా... పిలక పుణ్యావతికి శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కవిటి పోలీసులు మంగళవారం సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.