అనంతపురం జిల్లా రూరల్ మండల పరిధిలోని మనీలా గ్రామంలో తన స్నేహితురాలు మృతిని జీర్ణించుకోలేక లక్ష్మీదేవి అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇటుకలపల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గురువారం ఉదయం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.