వైసీపీ నేతలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మాజీ కార్పొరేటర్ ఏరుబోతు రమణారావు
వైసిపి నేతలు కావాలనే న్యూ రాజరాజేశ్వరి పేటలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణారావు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ... విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రబలుతుందని వైసీపీ నేతలు కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మెరుగైన వైద్యం బాధ్యతలుగా నిస్తున్నామని ఎటువంటి లోపం లేకుండా ప్రత్యేక వైద్య నిపుణులు సమక్షంలో వైద్యం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.