తాడేపల్లిగూడెం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాల్గవ పెట్రోల్ బంకులలో అగ్నిప్రమాదలపై అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది.
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నాల్గవరోజు ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ జి.వి.రామారావు ఆధ్వర్యంలో అగ్ని మాపక సిబ్బందితో కలిసి పట్టణంలో అగ్ని ప్రమాదాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పెట్రోల్ బంకులలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా ఫైర్ ఎక్సింగ్విటర్ లను ఉపయోగించాలి అనే విధానంపై లైవ్ డెమో చేసి చూపించారు. అగ్నిప్రమాదలు సంభవించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలని పెట్రోల్ బంకు లలో ఉండే సిబ్బందికి అవగాహన కల్పించారు.