సర్వేపల్లి: గంగమ్మకు నెల పొంగళ్ళు,జెమ్మి చెట్టుకి పూజలు చేసిన పొదలకూరు ప్రజలు
పొదలకూరులో గంగమ్మ కొలుపు మహోత్సవం యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మహోత్సవంలో నెల పొంగళ్ళ కార్యక్రమం ఆదివారం జరిగింది. ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యం, జెమ్మి చెట్టుకి పూజలు చేశారు.మధ్యాహ్నం ముగ్గు తీర్పు, సాయంత్రం అమ్మవారి దేవస్థానం వద్ద అమ్మవారికి భక్తులు నెల పొంగళ్లను ఏర్పాటు చేసి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం ముగిసింది.