ఇబ్రహీంపట్నం: హస్తినాపురం డివిజన్ పరిధిలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ సుజాత నాయక్
హస్తినాపురం డివిజన్ పరిధిలోని వందనపురి కాలనీలో కార్పొరేటర్ సుజాత నాయక్ ఆదివారం మధ్యాహ్నం పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య ఉందని కార్పొరేటర్ కు తెలుపగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ రోడ్ల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఓపెన్ జిమ్ వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానని స్థానికులతో కార్పొరేటర్ అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ అన్నారు.