కుప్పం: రూ.7 లక్షలకుపైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
గుడిపల్లి మండల పరిధిలోని 12 మందికి రూ.7,36,735 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ శ్రీకాంత్, మండల పార్టీ అధ్యక్షులు బాబు చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.