బొమ్మనహాల్ మండల కేంద్రం సమీపంలో బైక్ దగ్ధమైంది. బైక్ నుంచి బారీగా మంటలు వచ్చాయి. మంటల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. తృటితో బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి కర్ణాటక సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకులో బెక్ కు పెట్రోల్ వేయించుకొని సోమవారం రాత్రి స్వగ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగాయి. విజయ్ బెక్ ఆపేసి వెంటనే దిగేశాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మంటలు రావడానికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.