జీవో నెంబర్ 14 రద్దుచేసి భూములను జిందాల్ బాధితులకు తిరిగి ఇవ్వాలి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ డిమాండ్
Vizianagaram Urban, Vizianagaram | Sep 14, 2025
కంపెనీ పేరుతో భూములు తీసుకొని కంపెనీ కట్టకుండా సేకరించిన భూమిని తెగనమ్మడానికి సిద్ధపడ్డ నేపథ్యంలో పేదల నుంచి సేకరించిన భూములను తిరిగి ఆ భూములకే ఇచ్చేయాలనిAP రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు, ఆదివారం బొడ్డవరలో నిర్వాసితులతో చల్లా జగన్ మాట్లాడుతూ భూములు ఇచ్చిన నిర్వాసితులకు,తాటిపూడి రైతాంగానికి నష్టం చేసే GO నంబరు 14 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. బొడ్డవర- తాటిపూడి రోడ్డును ఆనుకొని ఉన్న విలువైన భూములను జిందాల్ పరిశ్రమ పేరుతో దళిత,గిరిజనులను మాయ చేసి సేకరించిన భూములను ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు GOనంబరు 14 తెచ్చి , ప్లాట్లుగా చేసి