నిర్మల్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ రాష్ట్ర నాయకులు రామ్నాథ్
Nirmal, Nirmal | Sep 16, 2025 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ పోస్టర్లను మంగళవారం నాయకులతో ఆవిష్కరించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అన్ని బూత్ స్థాయిలో బుధవారం జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, ముత్యం రెడ్డి సాదం అరవింద్ రాచకొండ సాగర్, గణేష్ కార్తీక్ సాయి చందు తదితరులు పాల్గొన్న