పెద్దపల్లి: గతంలో పాలకులు కటింగ్ల పేరిట రైతులను దోచుకున్నారు: సుల్తానాబాద్‌లో MLA విజయ విజయ రమణారావు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, సాంబయ్య పల్లి, ఐతరాజు పల్లి, భూపతిపూర్, గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో శుక్రవారం సింగిల్ విండో, ఐకెపి ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడినారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. తాము పూర్తి పారదర్శకంగా రైతులకు న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తున్నామని వివరించారు.