ఢిల్లీలో పేలుళ్లు, రేణిగుంట లో పలుచోట్ల ముమ్మర తనిఖీలు
ఢిల్లీలో పేలుళ్లు.. రేణిగుంటలో ముమ్మర తనిఖీలు ఢిల్లీలో సోమవారం సాయంకాలం భారీ పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడిగా అనుమానిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో అర్బన్ సీఐ జయచంద్ర, జీఆర్పీ ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఎస్ఐ ముమ్మరంగా మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. లగేజీతో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.