సోమందేపల్లిలో రహదారిపై అడ్డంగా పశువులు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని వాల్మీకి సర్కిల్లో ప్రతిరోజూ రాత్రి సమయాల్లో గోవులు రోడ్డుపై తిరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఆదివారం రాత్రి పశువులు రోడ్డుపై అడ్డంగా ఉండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పశువుల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. పశువులు రోడ్డుపైకి రాకుండా చూడాలని వాహనదారులు విన్నవించుకుంటున్నారు.