ఉదయగిరి: వెంకట్రావుపల్లి లో నూతనంగా నిర్మించిన గంగమ్మ పోతురాజు ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు
ఉదయగిరి మండలం,వెంకటరావుపల్లిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ పోతురాజు ఆలయంలో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2న గంగమ్మ, పోతురాజు విగ్రహాలకు జలాధివాసం, 3న గణపతి పూజ, ధ్యానదివాసం, పంచామృత స్నప్నం, గ్రామోత్సవం 4న ఆలయ శుద్ధి, మహాగణపతి పూజతో ఉదయం 11.32 గం.లకు విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.