ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయ్యత్ నగర్ డివిజన్లోని పద్మాలయ కాలనీలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను కార్పొరేటర్ కల్యం నవజీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయత్ నగర్ డివిజన్ ను అభివృద్ధి చేయడం తన యొక్క బాధ్యత అని. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం లేనప్పటికీ హయత్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని ఎంపీ ఈటల రాజేందర్ సహాయంతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.