అసిఫాబాద్: ఆసిఫాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
గుర్తుతెలియని వ్యక్తి ఆసిఫాబాద్ మండలంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. SHO బాలాజీ వరప్రసాద్ ప్రకారం.. మండల కేంద్రంలోని షేర్ పంజాబీ ధాబా నుంచి హైవే వైపు వెళ్లే దారిలో ఉన్న ముళ్ల పొదల్లో దాదాపు 30 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే సంప్రదించాలన్నారు.