ప్రొద్దుటూరు: సీఎం సహాయం లేనప్పుడు థాంక్యూ సీఎం అంటూ ఎందుకు చెప్పాలని మెప్మా అధికారులను ప్రశ్నించిన వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి
Proddatur, YSR | Sep 16, 2025 పొదుపు సంఘంలోని మహిళా సభ్యురాలు సబ్సిడీ లేని రుణంతో స్కూటీ కొనుక్కుంది. ఆ మహిళను మెప్మా అధికారులు మంగళవారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్దకు పిలిపించారు. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ఆ మహిళతో సెల్ఫీ వీడియో తీయించే ప్రయత్నం చేశారు. వైసీపీ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బంగారు మునిరెడ్డి అక్కడికి చేరుకొని ప్రభుత్వ సబ్సిడీ లేని రుణంతో కొన్న స్కూటీకి థ్యాంక్యూ సీఎం సార్ అంటూ చెప్పడమేంటంటూ మెప్మా అధికారులను వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ప్రశ్నించారు.