గిద్దలూరు: రాచర్ల మండలంలో వరి సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన వ్యవసాయ శాఖ అధికారి ఖాదర్ బాషా
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో వరి పంట వేసిన రైతులు తీసుకోవలసిన సస్యరక్షణ పై మండల వ్యవసాయ శాఖ అధికారి ఖాదర్ బాషా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వివరించారు. పంట 25 నుంచి 30 రోజుల మధ్యలో ఎకరాకు నత్రజని 25 కేజీల నుంచి 50 కేజీల వరకు పంటకు వేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా జింక్ ను ఎరువుల కలిపి ఉపయోగించకుండా కనీసం మూడు రోజుల వ్యవధి తర్వాత పంటకు ఉపయోగించుకోవాలన్నారు. అలానే ఎరువులు ఉపయోగించిన తర్వాత 48 గంటలు వరి పంటలో నిలబడి ఉన్న నీరును బయటకి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు అధిక మొత్తంలో పంట పొలంలో ఉంచకుండా పల్చగా ఉండేలా చూసుకోవాలన్నారు.