మేడిపల్లి: మేడిపల్లి, భీమారం మండలాల్లోని పలు గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
మేడిపల్లి భీమారం మండలాల్లో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున గ్రామ శివారులో ఉన్న పాము పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి అనంతరం నైవేద్యం సమర్పించారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా పాము పుట్ట వద్ద పాలు పోసి సాక్షాత్తు శివుని వేడుకుంటామని వారు తెలిపారు.