సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి : అంబేద్కర్ సేవా సమితి డిమాండ్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం సమితి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కి సరైన రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.