కోట మంగాపురం రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి
'కోట-మంగాపురం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి' కేవీబీపురం మండలం మిద్ది కండిగ మెయిన్ రోడ్డు నుంచి కోటమంగాపురం మీదుగా సుబ్రహ్మణ్యం నగర్ వరకు 2015లో ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రూ.14 లక్షలతో రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఆ రోడ్డు పూర్తిగా కంకర తేలి గుంతల మయంగా మారింది. వాహన చోదకులు, విద్యార్థులు, గర్భవతులు ఆ మార్గంలో వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారని స్థానికులు తెలిపారు. పాలకులు చొరవ తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.