ప్రొద్దుటూరు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి భూమి పూజ
Proddatur, YSR | Nov 3, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డ్ నందు ఐడియల్ స్కూల్ వద్ద 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్, మున్సిపల్ డిఈ రాజేష్ రాయల్ గౌస్ అన్సర్ ఖలీల్, మా