కొండపి: సింగరాయకొండలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. మంత్రి స్వామి మొక్కలు నాటి ప్రతి ఒక్కరు తమవంత బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అంతేకాకుండా తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు మొక్క నాటుతామని వాటిని పరిరక్షిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు.