చేపల వేట కెళ్ళి కాళంగి నదిలో వ్యక్తి గల్లంతు
- దొరవారిసత్రం మండలం కమ్మ కండ్రిగ గ్రామ సమీపంలో ఘటన
చేపల వేటకు వెళ్లి కాలంగి నదిలో వలవేస్తూ జారిపడి వ్యక్తి గల్లంతైన సంఘటన గురువారం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు పోలిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు కమ్మ కండ్రిగ గ్రామం సమీపంలోని కాళంగి నదికి అడ్డంగా నిర్మించిన చెక్ డాం వద్ద చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో మేకల పోలయ్య అనే వ్యక్తి చేపల వేటకు వల వేస్తూ ప్రమాదవశాత్తు జారి కాలంగి నదిలో పడిపోయాడు. ఉధృతంగా ఉన్న కాలంగి నది ప్రవాహంలో అతను కొట్టుకుపోయాడు. ఈ సమాచారాన్ని వెంటనే సహచరులు పోలీసులకు తెలియజేశారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ డి ఆర్ ఎఫ్