శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథక కార్మికులకు పదివేల కనీస వేతనం,మెనూ ఛార్జీలు ఇవ్వాలి:కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహాలక్ష్మి
జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులకు రూ. 10 వేలు కనీస వేతనం ఇస్తూ... మెనూ చార్జీలు పెంచాలని కోరుతూ కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న యుటిఎఫ్ భవనంలో జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ... ప్రతి నెల 5వ తేదీ లోపల మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు చెల్లించాలని, మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ఆమె తెలిపారు. పాఠశాలలో వంట కొరకు గ్యాస్ ధరలు ప్రభుత్వమే చెల్లించాలని, కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆమె కోరారు